Advertisement
కార్తీకమాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. కార్తీకమాసంలో కొన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వడం వలన ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కార్తీకమాసంలో తులసి కోట దగ్గర రోజూ దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. భారతీయ హిందువులు కార్తీక మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది తెల్లవారుజామున నిద్ర లేచి పరమేశ్వరుడిని ఆరాధించి దీపం పెడతారు. అలాగే సాయంత్రం కూడా పూజ చేసి దీపారాధన చేస్తారు.
Advertisement
కార్తీక స్నానాలు, దీపాలు విష్ణు సంకీర్తనలతో కార్తీకమాసం భక్తితో మారుమ్రోగి పోతుంది. రుద్రాభిషేకాలు కూడా చాలామంది చేస్తారు. కార్తీక మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి కోట దగ్గర దీపం పెట్టడం మంచిది. తులసి మొక్కని లక్ష్మీస్థానంగా చెప్తారు. తులసి మొక్క దగ్గర కార్తీకమాసంలో దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది.
Advertisement
Also read:
కార్తీకమాసంలో తులసి పూజ, తులసి దగ్గర పెట్టే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తే మరీ మంచిది. సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తి తొలగిపోతుందట. అలాగే తులసి దగ్గర దీపం వెలిగించడం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే గట్టెక్కిపోతాయి. కుటుంబ సభ్యులు మధ్య ఇబ్బందులు కూడా తొలగిపోతాయట. ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే తులసికోట దగ్గర కార్తీకమాసంలో రోజూ దీపం పెట్టడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం చూడండి!