Advertisement
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణిమ రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 19న వచ్చింది. ఈ పవిత్రమైన పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు తమ సోదరులకు రక్షా సూత్రాన్ని కడతారు. తమ సోదరుడిని క్షేమం, విజయం, కాంక్షిస్తూ రాఖీ కడతారు. తమకు అనుదినం అండగా ఉండాలని సోదరీమణులు కోరుతారు. శ్రావణ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి అంకిత ఇవ్వబడుతుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని రకాల పరిహారాలను కచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
Advertisement
కొన్ని చోట్ల రాఖీ పండుగ నాడు గ్రహదోషాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తారు. ప్రతి ఒక్కరు సోదరులు సోదరీమణుల ఆశీస్సులతో పాటు తల్లిదండ్రులు గురువులు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయడం వలన జీవితంలో సక్సెస్ లభిస్తుంది. మేధస్సు బలం సమాజంలో గౌరవం పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ నాడు సోదరి సోదరీమణులు చంద్రుడితో పాటు నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయట.
Advertisement
Also read:
రాఖీ పండుగ నాడు ప్రతి ఒక్క సోదరుడు సోదరీమణులతో ఆహారం సామర్థ్యం మేరకు కొంత సొమ్మును పేద ప్రజలకు దానం చేయడం మంచిది ఇలా చేయడం వలన పుణ్యఫలం దక్కుతుంది. రక్షాబంధన్ అనేది దేవతలకు ముడిపడి ఉన్నందున ఈ పవిత్రమైన రోజున బాలకృష్ణుడికి వంశదేవతలకు రక్ష సూత్రాన్ని కట్టే సంతోషం సంపద ఐశ్వర్యం కలుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకునే సందర్భంలో లక్ష్మీనారాయణకి ప్రత్యేక పూజలు చేయాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!