Advertisement
ప్రతీ ఒక్కరు కూడా లైఫ్లో కాన్ఫిడెన్స్ గా ఉండాలని అనుకుంటారు. గెలవాలని అనుకుంటారు. కానీ చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే గెలవాలంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఏ పనిలో అయినా కూడా విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం అలవాటు చేసుకోవాలి. విశ్వాసం లేకపోతే విజయం దూరం అవుతుంది. ఇక్కడ చెప్పిన విషయాలను మీరు ఫాలో అయ్యారంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా రకరకాల గోల్స్ ఉంటాయి. వాటిని బట్టి ఫాలో అవ్వాలి తప్ప ఇతరులను చూసి చేయకూడదు.
Advertisement
అలాగే నెగటివ్ ఫ్రెండ్స్ వద్దు. నెగిటివ్ ఫ్రెండ్స్ ఉండడం వలన కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులకు దగ్గరగా ఉంటే అనుకున్నది సాధించొచ్చు. అలాగే స్వీయ క్రమశిక్షణని ఫాలో అవ్వాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. వాటితో పాటుగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు.
Advertisement
Also read:
మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే దాని వలన మీరు అనుకున్నది సాధించడానికి అవ్వదు. మీరు ఇంకా కిందకి పడిపోతూ ఉంటారు తప్ప జీవితంలో పైకి రాలేదు. అలాగే నో చెప్పడం కచ్చితంగా నేర్చుకోండి. చాలా మంది నో చెప్పలేకపోతుంటారు. నో చెప్తే కచ్చితంగా మానసికంగా దృఢంగా మారొచ్చు. అదే విధంగా వ్యక్తిగత ఛాలెంజ్ లు ముఖ్యాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడానికి వ్యక్తిగత చాలెంజ్ లు తీసుకోవడం ముఖ్యం. వ్యక్తిగత చాలెంజ్లు తీసుకోవడం వలన పాజిటివ్స్, నెగటివ్స్ రెండూ కూడా అర్థమవుతాయి. దయతో ఉంటే మానసికంగా దృఢంగా ఉండొచ్చు. దయ కలిగి ఉన్నట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!