Advertisement
వర్షాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో దోమలను తరిమికొట్టడానికి ఈ సులువైన చిట్కాలను పాటించడం మంచిది. నారింజ, నిమ్మకాయలని సగానికి కట్ చేసి తలుపులు కిటికీల వద్ద పెడితే ఈ వాసనకి దోమలు దూరంగా వెళ్లిపోతాయి. కాబట్టి నారింజ నిమ్మని మీరు ట్రై చేయొచ్చు. దోమల నుండి బయటపడడానికి లావెండర్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనె, బాదం నూనె లో కొంచెం లావెండర్ ఆయిల్ వేసి మీరు దోమలు ఉన్న చోట స్ప్రే చేయొచ్చు.
Advertisement
Advertisement
అప్పుడు దోమల నుండి పారిపోతాయి. దోమలు కుట్టడం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. చర్మానికి మీరు ఈ మిశ్రమాన్ని రాసుకుంటే కూడా దోమలు మాయమైపోతాయి. మిగిలిపోయిన కాఫీ పొడిని గిన్నెలో వేసి ఇంటి పరిసరాల్లో పెడితే దోమలు ఇంటికి రావు. పెప్పర్ మింట్ నూనె కూడా దోమల వికర్షణకంగా పనిచేస్తుంది. ఇంటి చుట్టూ తులసి లేదా లెమన్ గ్రాస్ మొక్కల్ని పెంచితే కూడా దోమలు మీ ఇంట్లోకి రావు.
Also read:
ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో దోమల్ని తరిమికొట్టేయొచ్చు. దోమలు కుట్టడం వలన సీజన్లో చాలా సమస్యలు వస్తాయి. దోమల వలన వివిధ రకాల సమస్యలకి గురవుతూ ఉంటారు. కాబట్టి దోమలతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న చోట దోమలు లేకుండా చూసుకోవాలి. లేదంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి.
ఆరోగ్య చిట్కాలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం మీరు చూడండి!