Advertisement
కొంతమందికి కోపం సహజంగా ఉంటుంది. ఏదైనా చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఏ రిలేషన్ షిప్ లో అయినా ప్రేమ ఓపిక చాలా అవసరం. కొంతమందికి చిన్న చిన్న విషయాలకి కోపం వస్తుంది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. దీంతో రిలేషన్ బలహీన పడుతుంది. కోపానికి అన్నిటిని ఒక్కసారిగా నాశనం చేసే శక్తి ఉంది. కాబట్టి భాగస్వామి కోపం ప్రవర్తన కచ్చితంగా సంబంధాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. అందుకే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Advertisement
ప్రేమ బాధ్యత అంచనాలతో పాటుగా రిలేషన్ షిప్ లో గొడవలు ఉంటాయి వాటిని మైంటైన్ చేయకపోతే గొడవలు పెద్దగా అవుతాయి. అలాంటప్పుడు కోపంగా ఉన్న పార్ట్నర్ ని కంట్రోల్ చేయడానికి మానసికంగా దృఢంగా ఉండాలి. మీరు కోపంగా రిప్లై ఇవ్వకండి. మీ పార్టనర్ మీతో కోపంగా మాట్లాడితే మీరు నార్మల్ గా ఉండండి అప్పుడు వాళ్ళ కోపం కూల్ అవుతుంది కోపంగా ఉన్న పార్ట్నర్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు సైలెంట్ అయ్యాక మాట్లాడండి కోపంతో ఉన్నప్పుడు మీరు మాట్లాడొద్దు పైగా కోపం ఏ విషయాన్ని కూడా పరిష్కరించలేదు అని గుర్తుపెట్టుకోండి. ప్రశాంతమైన మనసుతో చెప్పింది. అర్థం చేసుకున్నప్పుడు వారే తమకు తప్పును తెలుసుకుంటారు.
Advertisement
Also read:
అలానే వాళ్ళు అసలు ఎందుకు కోపంగా ఉన్నారు అనేది తెలుసుకోండి కొన్ని కారణాల వలన కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. దాని కారణమేంటో తెలుసుకోండి కొన్నిసార్లు ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. పాత జ్ఞాపకాల వలన వ్యక్తుల ప్రవర్తన మారిపోతూ ఉంటుంది అటువంటి అప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది ఇలా చేయడం వలన కోపం కంట్రోల్ అవుతుంది. మంచి రిలేషన్షిప్ కోసం మాట్లాడుకోవడం చాలా అవసరం మీ పార్ట్నర్ వారి మాటలను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు మీ పార్ట్నర్ తో మాట్లాడి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో ఆలోచించండి. అంతే కానీ మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దొద్దు. ఇలా ఈ విధంగా మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవచ్చు సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!