Advertisement
ఒక పూట తిండి లేకుండా ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నారు ప్రస్తుత సమాజం. అరచేతిలో భూగోళాన్ని చూడడం మంచిదే కానీ , దానిద్వారా సమస్యలను కొని తెచ్చుకోవద్దని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది ఫోన్లు చూస్తూనే రాత్రిపూట నిద్రలోకి జారుకుంటారు. ఆ ఫోన్ మీ తలపక్కన పెడుతూ ఉంటారు.
Advertisement
also read:మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?
దీనివల్ల అనేక దుష్ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొంతమంది రాత్రి పూట ఇంపార్టెన్స్ కాల్స్ వస్తాయని సెల్ ఫోన్ బెడ్ రూమ్లో పక్కన పెట్టుకొని పడుకుంటారు. అలాంటివారు సెల్ ఫోన్ పడుకునే సమయంలో కాస్త దూరంగా పెట్టుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మీ దృష్టి దెబ్బతింటుందని, నిద్రలేమి సమస్య వస్తుందని తెలియజేస్తున్నారు.
Advertisement
నిద్ర పోవడానికి బ్రెయిన్ లో మెలటోనీన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు వాడే స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే బ్లూ లైట్ వల్ల హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా మీరు స్మార్ట్ ఫోన్ వాడుతూ నైట్ అంతా అలర్ట్ గా ఉంటారు. సరిగ్గా నిద్ర కూడా పోలేదు. దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. సరిగ్గా నిద్ర పోక తెల్లవారుజామున ఆఫీస్ కి వెళ్ళాక యాక్టివ్ గా పని చేయలేరని డాక్టర్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
also read:ఇప్పటంలో మళ్లీ.. ఈసారి ఏం జరగనుంది..?