Advertisement
Sr.Ntr: సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణజన్ముడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు చరిత్ర అన్నది వాదనలేని అంశం.
Advertisement
Read also: రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచిన స్టార్ 10 హీరోయిన్ల లిస్ట్ వారెవరంటే ?
ఇక సినిమాలలో ఉన్న సమయంలో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అన్నగారు పరిమితంగానే రెమ్యూనరేషన్ తీసుకుని నిర్మాతలకి సపోర్టుగా ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాగా అన్ని రకాల వంటలను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారట. ఇప్పటి మాదిరిగా ఏరి కోరి.. డైటీషియన్లు చెప్పినట్టు హీరోలు తినే భోజనంలా కాకుండా ఫక్తు తెలుగు సంప్రదాయ రుచులకు అన్నగారు పెద్దపీట వేసేశారు. సినిమా షూటింగ్ సమయంలో కూడా విడిగా కాకుండా అందరితో కలిసి తినడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించేవారట. లైట్ బాయ్ నుంచి మేకప్ మెన్ వరకు.. దర్శకుడి నుండి నిర్మాత వరకు ఎవరికీ ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇచ్చేవారు. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పల్లెటూరు నుంచి వచ్చిన రైతుబిడ్డ కావడంతో హోటల్ ఫుడ్ అంతగా ఇష్టపడేవారు కాదట.
Advertisement
ఎన్టీఆర్ కి మాగాయ్ పచ్చడి అంటే చాలా ఇష్టమట. మాగాయ్ పచ్చడిని ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడే వారిని.. నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్ బంధువులు మాగాయ్ పచ్చడిని ఆయనకు పంపించే వారని తెలుస్తోంది. నిమ్మకూరులో ఉండే వారి పిన్ని ఆయన కోసం ఆ పచ్చడిని పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి చెన్నైకి పంపించేవారట. ఆ పచ్చడిని ఆయన తినడంతో పాటు ఇతరులకు సైతం రుచి చూపించే వారని.. ఆ పచ్చడిని ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారట. అలా స్టార్ హీరో అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ తిండి విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. నచ్చిన వంటకాలని సంతృప్తిగా తిన్నారు.
Read also: ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేసేవాడంటే ?