Advertisement
సాధారణంగా పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక కీలక ఘట్టం అనే చెప్పాలి. మనిషి పుట్టిన తరువాత తెలిసి చేసుకునేది కేవలం పెళ్లి మాత్రమే. కానీ పెళ్లి చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే.. జీవితం బాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పెళ్లి చేసుకుంటే ఎవ్వరి జీవితం అయినా బాగుపడుతుందని పెద్దలు పేర్కొంటారు. అయితే అందరి విషయంలో అలా జరుగుతుందంటే పొరపాటే అని చెప్పాలి. ప్రతీ ఒక్క కుటుంబంలో ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుగుతున్నారంటే వారికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ వారి బంగారు భవిష్యత్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. పెళ్లి విషయంలో కాస్త మగవారికి రిలీఫ్ దొరుకుతుందనే చెప్పాలి.
Advertisement
ముఖ్యంబా అబ్బాయిలు సెటిల్ అయితేనే పెళ్లి ప్రస్తావన ముందుకొస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా పెళ్లి జరిగిందంటే చాలా మంది సంవత్సరం లోపు విడాకుల బాట పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం జీవితంపై అవగాహన లేకపోవడం.. చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. 28 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు నిపుణులు. పెళ్లి విషయంలో ముఖ్యంగా ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.