Advertisement
కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా తమన్న, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.
Advertisement
ఇక బాహుబలి పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అవడంతో బాహుబలి పార్ట్ టు పై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబలి పార్ట్ 2 సినిమా రీచ్ అవడంతో పాటు 1600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే బాహుబలి చిత్రంలో రానా భల్లాల దేవుడిగా కనిపించాడు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ బల్లాల దేవుడిగా కనిపించాడు. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన ముఖంపై గీత ఉంటుంది. అది ఎందుకు వచ్చిందని విషయం బాహుబలి అభిమానులకు ఎవరికైనా గుర్తుందా?
Advertisement
ఆ గీతని బల్లాలదేవుడు తనకు తానే పెట్టుకుంటాడు. కుమార వర్మ తనకు హాని కలిగించడానికి వచ్చినట్టు అందరిని నమ్మించడానికి పెట్టుకుంటాడు. ఈ గీత ఎక్కడ మిస్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడ్డాడు. అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మనకు ఆ గీత కనిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న అంశాలపై కూడా రాజమౌళి ఎంత జాగ్రత్త వహిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక రాజమౌళి త్వరలోనే మహేష్ తో సినిమా చేయనున్నారు.
READ ALSO : రాజమౌళి నటించిన ఒకేఒక ప్లాప్ సినిమా ఎదో తెలుసా ?