Advertisement
ఆపదలో ఉన్న వారికి దేవుడు అండగా ఉంటాడో లేదో తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తారు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలను ఆదుకున్నారు ఆయన. వందలాది మంది పేదల ఆకలి తీర్చిన దయామయుడు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ అసలు సిసలు హీరోగా గుర్తింపు సాధిస్తున్నారు. మరి ఇంతకీ సోనూసూద్ ఇంతమందికి ఎలా సాయం చేయగలుగు తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం..
Advertisement
48 సంవత్సరాల సోనుసూద్ పంజాబ్ లో జన్మించారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 130 కోట్లు. తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు సోనూసూద్. 2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2002లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మణిరత్నం దర్శకత్వంలో 2004లో యువ మూవీలో చేశాడు. 2005లో తెలుగు సినిమా సూపర్ ద్వారా మరింత పేరు సంపాదించారు. దీని తర్వాత సోను చారిటీ ఫౌండేషన్ స్థాపించారు. సంభవ పేరుతో ఐఏఎస్ కోచింగ్ ఉచితంగా అందిస్తున్నారు.
Advertisement
సినిమాల్లో నటించడంతో పాటుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా రెండు చేతులతో డబ్బులు సంపాదిస్తున్నారు. 2016లో శక్తి సాగర్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం. గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయి. ముంబైలో 2600 గజాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. పంజాబ్లోని మొగాలో ఐదు వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది. ఇందులో తన కుటుంబ సభ్యులు ఉంటారు. దాని విలువ సుమారు 20 కోట్లకుపైగా ఉంటుందట.
ALSO READ: