Advertisement
మరో రెండు రోజుల్లోనే ఆగస్టు నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతీ నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో తెలిపే జాబితా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. ఆగస్టు నెలకు సంబంధించిన సమాచారాన్ని తాజాగా విడుదల చేసింది. అయితే ఆగస్టు నెలలో 14 రోజులు పాటు బ్యాంకులు పని చేయవు. దేశంలోని బ్యాంకులు ఆదివారంతో పాటు రెండు, నాలుగో శనివారాలు సెలవులుంటాయి. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండుగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. సెలవు రోజుల్లో బ్యాంకులు మూసేసి ఉన్నప్పటికీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బ్యాంకుకు వెళ్లి నేరుగా పూర్తి చేసుకోవాల్సిన పనులుంటే మాత్రం తప్పకుండా సెలవులను గమనించాలి.
Advertisement
Advertisement
ఆగస్టు నెలలో బ్యాంకు సెలవుల వివరాలు :
ఆగస్టు 06 : ఆదివారం
ఆగస్టు 08 : టెండాంగ్ రమ్ పాట్ (సిక్కింలోని గ్యాంగ్ టక్ లో సెలవు)
ఆగస్టు 12 : రెండో శనివారం
ఆగస్టు 13 : ఆదివారం
ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16 : పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్ పూర్, బేలాపూర్ లో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 18 : శ్రీమత శంకర్ దేవ్ తిథి ( గౌహతిలో బ్యాంకులకు సెలవు)
ఆగస్టు 20 : ఆదివారం
ఆగస్టు 26 : నాలుగో శనివారం
ఆగస్టు 27 : ఆదివారం
ఆగస్టు 28 : మొదటి ఓనం (కేరళలో)
ఆగస్టు 29 : తిరుఓణం (కేరళ)
ఆగస్టు 30 : రాఖీ పండుగ
ఆగస్టు 31 : శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్ లాబ్సోల్