Advertisement
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరుత మూవీతో రామ్ చరణ్ 2007లో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే విజయం అందుకున్నాడు. రెండో సినిమా మగధీరతో చరిత్రనే తిరగరాశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన స్టైల్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈ మధ్యలో కొన్ని సినిమాలకు నో చెప్పాడు చరణ్. ఎక్కువగా మణిరత్నం, గౌతమ్ మీనన్ వంటి దర్శకులకు నో చెప్పాడు. వాళ్ల కథలు నచ్చినప్పటికీ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నాడు మెగాపవర్ స్టార్. అలా ఈ 15 ఏళ్ల గ్యాప్ లో రామ్ చరణ్ వదిలేసిన సినిమాలు ఏవి.. వాటి ఫలితాలను మనం తెలుసుకుందాం.
Advertisement
సూర్య సన్నాఫ్ కృష్ణన్
చిరుత సినిమా అలా విడుదల అయితే లేదో అప్పుడే దర్శకుడు గౌతమ్ మీనన్ నుంచి రామ్ చరణ్ కి ఆఫర్ వచ్చింది. అప్పటికే మగధీర సినిమాకు కమిట్ అయ్యాడు రామ్ చరణ్. దీంతో సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీని వదిలేసుకున్నాడు చరణ్. ఆ మూవీని సూర్యతో చేసి హిట్ కొట్టా గౌతమ్ మీనన్.
ఓకే బంగారం
మణిరత్నంతో సినిమా చేయాలని దాదాపు ప్రతీ హీరోకి ఉంటుంది. ఓకే బంగారం కథ నచ్చినప్పటికీ కూడా రామ్ చరణ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాడట. ఈయన కాదనడంతో ఈ మూవీని దుల్కర్ తో చేశాడు. మంచి విజయంసాధించింది ఓకే బంగారం.
ఎటో వెళ్లిపోయింది మనసు
దర్శకుడు గౌతమ్ మీనన్ తొలుత ఎటో వెళ్లిపోయింది మనసు కథను రామ్ చరణ్ కి చెప్పాడట. ఆరెంజ్ మూవీతో అప్పుడే ఓ ఫ్లాప్ అందుకున్న రామ్ చరణ్ క్లాస్ కథలు సెట్ అవ్వవు అని రిజెక్ట్ చేశాడట. దీంతో రామ్ చరణ్ కాదన్న తరువాత నేచురల్ స్టార్ నానితో చేశాడు గౌతమ్ మీనన్.
కృష్ణార్జున యుద్ధం
Advertisement
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి రెండు హిట్ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ రామ్ చరణ్ కి కృష్ణార్జున యుద్ధం కథ చెప్పాడట. కానీ అప్పటికే చరణ్ నాయక్ లో ద్విపాత్రాభినయం చేయడం.. వెంటనే మరోసారి డబుల్ రోల్ అని వద్దనుకున్నాడట. దీంతో ఈ సినిమాని నానితో చేశాడట మేర్లపాక గాంధీ.
నేల టిక్కెట్టు
దర్శకుడు కృష్ణ కురసాల మెగా ఫ్యామిలీ చాలా దగ్గర.. పైగా అప్పటికే సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుకచూద్దాం వంటి సినిమాలను తీసి సక్సస్ సాధించాడు. ఈయన చెప్పిన నేల టిక్కెట్టు కథ చరణ్ కి నచ్చలేదట. దీంతో నో చెప్పాడు. ఆ తరువాత రవితేజతో ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఏజెంట్
దృవ తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో మరొక సినిమాను తెరకెక్కించాలనుకున్నాడట. అప్పటికే వక్కంతం వంశీ ఇచ్చిన ఏజెంట్ మూవీ కథను చరణ్ కి వినిపించాడట సురేందర్ రెడ్డి. చరణ్ కి ఈ స్పై థ్రిల్లర్ చేయాలని ఉన్నప్పటికీ అప్పటికే ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాలతో బిజీగా ఉండడతో ఈ చిత్రానికి నో చెప్పాడట. ఈ మూవీని అఖిల్ తో తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రం ఫలితం కూడా ఆశించిన మేరకు రాబట్టలేకపోయింది. రామ్ చరణ్ నో చెప్పిన సినిమాల్లో సూర్య సన్నాఫ్ కృష్ణణ్, ఓకే బంగారం తప్ప మిగిలిన సినిమాలన్నీ బొక్కబోర్ల పడ్డాయి. దీంతో చరణ్ జడ్జిమెంట్ చాలా కరెక్ట్ అంటున్నారు అభిమానులు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ ఛానెల్స్ పై పరువు నష్టం కేసు వేస్తా.. అషురెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
పవన్ కళ్యాణ్ పదే పదే రీకాల్ అంటున్నారు.. రీకాల్ అంటే అర్థం ఏంటో తెలుసా..?