Advertisement
టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతీ మాట్లాడుతూ, చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేస్తాడని చెబితే ఇప్పటికీ కూడా ఎవరూ నమ్మడం లేదు.
Advertisement
READ ALSO : దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
కానీ వాళ్ళు పూర్తిగా మునిగిపోయాకే చంద్రబాబు క్యారెక్టర్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక మా ఆయన ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి అని డెసిషన్ తీసుకున్న టైములో అందరికీ ఆస్తిపాస్తులు అన్ని సమానంగా పంచేశారు. అయితే అప్పట్లో నేను సీనియర్ ఎన్టీఆర్ నీ పెళ్లి చేసుకున్న టైంలో అందరూ కేవలం డబ్బు కోసం, పదవి కోసం ఆయనను వలలో వేసుకొని పెళ్లి చేసుకుంది అని అన్నారు. కానీ నన్ను పెళ్లి చేసుకునే టైంకి ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్స్ ! ఎవరు ఎక్కువ అంటే ?
అలాగే ఎన్టీఆర్ గారు నన్ను చాలాసార్లు రాజకీయాల్లోకి రమ్మని చెప్పారు. కానీ నేను ఏనాడు కూడా రాజకీయాల్లోకి వెళ్లలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారు తన కొడుకులందరికీ మంచి ఇల్లు కట్టించాడు. అలాగే ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఇచ్చారు అంటూ నందమూరి ఫ్యామిలీ గురించి లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది. కాగా రెండో పెళ్లి చేసుకుంటే రాజయోగం పడుతుందని జాతకాలు విని సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
READ ALSO : రోహిత్ పై అంపైర్ నితిన్ ప్రేమ.. కోహ్లీపై వివక్ష..!