Advertisement
విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2004 లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన తెలుగు కుటుంబ కథా చిత్రం ” మల్లీశ్వరి”. ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్, అలాగే నరేష్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పూర్తి పేరు గ్రీష్మ నేత్రికా బోయిని. ఈమె అమ్ములు సినిమాతో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Advertisement
Read also: రియల్ లైఫ్ లో పెళ్లికూతురుగా మన హీరోయిన్లు.. ఫొటోస్..
ఆ చిత్రం తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి, సిద్ధార్థ్ చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అనుష్క నటించిన పంచాక్షరి, శర్వానంద్ నటించిన ప్రస్థానం ఇలా 30 చిత్రాలలో బాలనటిగా నటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవతారకం చిన్నప్పటి క్యారెక్టర్ లో కూడా నటించింది. నేత్రిక 2000 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన హైదరాబాద్ లో జన్మించింది. ఈమెకి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు శ్రావ్య. లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రావ్య. అయితే బాలనటిగా ఓ వెలుగు వెలిగిన గ్రీష్మ స్టడీస్ కారణంగా ఇన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు ఓ మంచి ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది.
Advertisement
Also Read: సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.. ఒక్క రోజుకి ఎంత తీసుకుంటున్నారంటే..?
అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో సందడి చేస్తూ ఉంటుంది. నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాలో ఓ పాటలో కూడా కనిపించింది గ్రీష్మ. ఇక సోషల్ మీడియాలో గ్రీష్మ షేర్ చేసే ఫోటోలు నేటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను దిల్ రాజ్ బ్యానర్ లో హీరోయిన్ గా పరిచయం అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. త్వరలోనే తనని సినిమాలలో చూస్తారు అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?