Advertisement
సాధారణంగా మనకు ఉన్నటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు వల్ల చాలా లాభాలున్నాయి. ఏచిన్న పని చేయాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ కార్డులో ఉండే 12 అంకెలు కలిగిన నెంబర్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని జారీ చేస్తుంది. అయితే చాలా మందికి ఆధార్ లో ఫొటో నచ్చదు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఆధార్ కార్డు ఫొటో నచ్చని వారిలో మీరు కూడా ఒకరైతే ఇలా చేయండి. ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవచ్చు.
Advertisement
Advertisement
ఆధార్ కార్డులోని ఫొటో మార్చుకునేందుకు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కి వెళ్లాలి. మీరు https://appointments.Uidai.gov.in వెబ్ సైట్ లో మీ సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ నమోదు, సవరణ లేదంటే అప్డేట్ ఫారం డౌన్ లోడ్ చేయవచ్చు. లేదంటే ఆధార్ కేంద్రంలో తీసుకోవచ్చు. ఆ ఫారమ్ లో వివరాలను పూరించి ఆధార్ కేంద్రంలో ఇవ్వాలి. ఇక ఆ తరువాత మీ వివరాలను అప్డేట్ చేస్తారు. ఫొటో మార్చుకోవాలన్నప్పుడు లైవ్ ఫొటో తీసుకుంటారు. మీరు రూ.100 వరకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ తరువాత అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ వస్తుంది. స్టేటస్ చెక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :