Advertisement
భారతదేశ మొట్టమొదట కేంద్ర బడ్జెట్ 1947ను ఆర్కె షణ్ముగం శెట్టి సబ్మిట్ చేయడం జరిగింది. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది. భారతదేశ మొదట కేంద్ర బడ్జెట్ 1947ను ఆర్కే షణ్ముఖం సమర్పించారు. తొలి బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా ఆహార పారిశ్రామిక ఉత్పత్తి పెంచడం కోసం అలాగే దిగుమతుల్ని తగ్గించడం, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చూసారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రక్షణ రంగం సమాజంలో శాంతిభద్రతలకు కూడా ముఖ్యంగా ప్రస్తావించారు.
Advertisement
బ్రిటిష్ కాలంలో నాలుగు ఏళ్ళు 127 కోట్ల విలువైన 43.80 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసిన స్వాతంత్రం వచ్చాక 42 కోట్ల విలువైన 10.62 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని సాధించాలని కృషి మొదలైంది. 1947 – 48 ఆర్థిక సంవత్సరంలో 171.15 కోట్ల ఆదాయం 197.39 కోట్ల వ్యాయ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ రంగానికి 92.74 కోట్లు మిగతా భాగం కేటాయించారు.
Advertisement
Also read:
Also read:
స్టెర్లింగ్ పద్దు కింద 1946 ఏప్రిల్ 5 నాటికి రూ.1733 కోట్లు ఉండగా 1947 జూలై నాటికి రూ. 1547 కోట్లకు తగ్గాయి. ఆహార దిగుమతులు కారణంగా ఈ మారక నిల్వలు తగ్గాయి. ఎంపైర్ డాలర్ పూల్ క్రింద 45 కోట్లు విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి 240 కోట్లను ఖర్చు చేశాము. స్వతంత్రం భారత్ ఆసియాలో లీడర్ కావాలన్న లక్ష్యంతో క్రమశిక్షణతో కూడిన చర్యలు చేపట్టాలని షణ్ముఖం పిలుపునిచ్చారు ఆయన శాంతిభద్రతలను కాపాడి ఉత్పత్తిని పెంచి అంతర్గత సంఘర్షణలను నివారించేందుకు దేశ ప్రజల సహకరించాలని అప్పుడు కోరారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!