Advertisement
కొన్ని కాంబినేషన్లు ఊహకే పరిమితమవుతాయి. అవి ఆచరణాత్మకంగా పని చేయవు. కానీ కొన్ని కాంబినేషన్లు చేతికి వచ్చి జారిపోతాయి. అలాంటి కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబినేషన్ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఆయన కెరీర్ ని ప్రారంభించాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత గోకులంలో సీత చిత్రం నటించినా.. అది కూడా పవన్ కళ్యాణ్ కి అంతగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. కేవలం చిరంజీవి తమ్ముడుగానే అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రం ప్రేక్షకుల్లో అంతగా గుర్తింపు రాలేదు.
Advertisement
లవ్ అండ్ సెంటిమెంట్ స్టోరీగా తెరకెక్కిన మూడవ మూవీ అయినా సుస్వాగతం సూపర్ హిట్ సక్సెస్ ను సాధించి పవన్ కళ్యాణ్ కి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో పవన్ కి జోడిగా దేవయాని నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కంటే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను పెట్టాలనుకున్నారట. కానీ పవన్ దానికి కళ్యాణ్ అంగీకరించలేదు. ఇంత పెద్ద నటితో నటించే ధైర్యం నాకు లేదు. ఆమె నటన ముందు నా పెర్ఫార్మెన్స్ తేలికవుతుందని, అందుకే ఆమె బదులు మరొకరిని నటిని పెట్టమని పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలను కోరడం జరిగిందట.
Advertisement
కానీ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రంలో ఎంతో అనుకోవా, పద్ధతి ఉన్నా అమ్మాయి పాత్రను సౌందర్య మాత్రమే చేయగలదని, ఆమె ఈ సినిమాకు ప్లస్ అవుతుందని పట్టుబట్టారట. ఇక దర్శకుడు అలా చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అతడు సౌందర్యను డేట్ అడగగా.. ఆమె దగ్గర లేదని చెప్పిందట. ఇక చేసేదేమీ లేక అదే తరహాలో హోమ్లీ ఇమేజ్ ఉన్నా తమిళ స్టార్ హీరోయిన్ దేవయాని ఈ చిత్రంలో తీసుకోవడం జరిగింది. అలా పవన్ కళ్యాణ్ సౌందర్య కాంబినేషన్ లో మిస్ అయ్యి.. పవన్ కళ్యాణ్, దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం చిత్రం సూపర్ హిట్ సక్సెస్ అయింది. అప్పట్లో ఈ మూవీ 5 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
Also read :
బిజినెస్ లో కూడా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న మన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా..?
అగ్ర హీరోల సినిమా ఛాన్సులు అందుకున్న హిట్ కొట్టలేకపోయిన స్టార్ డైరెక్టర్స్ !