Advertisement
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం మనకి తెలుసు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన డబల్ ఇస్మార్ట్ థియేటర్లలో విడుదల కావడానికి ఇంకో వారం రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా మీద రామ్ ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డబల్ స్మార్ట్ సినిమా కోసం 18 కిలోలు బరువు తగ్గానని రామ్ చెప్పారు.
Advertisement
డబల్ స్మార్ట్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని కావ్య మంచి డాన్సర్ అని రామ్ చెప్పారు. డబల్ ఇస్మార్ట్ లో ప్రమోషన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ ని ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఈ మూవీ క్లైమాక్స్ హైలెట్ అని స్కంద మూవీ లో నా బరువు 86 కేజీలు కాగా ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కి 68 కిలోలు మాత్రమేనని చెప్పారు. స్కంద షూట్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్లి లుక్ ని మార్చుకున్నాను అని రామ్ చెప్పారు. కేవలం 30 రోజుల్లో 18 కిలోల బరువు తగ్గానని అన్నారు.
Advertisement
Also read:
Also read:
డబల్ స్మార్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైన వెంటనే ఈ మూవీలో సంజయ్ దత్త నటిస్తే బాగుంటుందని అందరం ఫీల్ అయ్యామని రామ్ అన్నారు సంజయ్ దత్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకుని ఎదుర్కొన్నారని సంజయ్ దత్ ఎంత పెద్ద నటుడు అయినా అందరితో కలిసిపోతారని అన్నారు. మణిశర్మ పూరి జగన్నాథ్ కాంబినేషన్ నాకు ఇష్టమైన కాంబినేషన్ అని అన్నారు. వీళ్ళిద్దరి కాంబో సినిమాల్లో పాటలు సూపర్ హిట్ గా నిలుస్తాయని అన్నారు. రామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!