Advertisement
Sr.NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి, ఆయన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలు వెలకట్టలేనివి. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పేరుతో ఒక పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత అద్భుతమైన పథకాలను తీసుకువచ్చారు. అయితే అంతటి ఎన్టీఆర్ జీవితాన్ని ఒక టీవీ ఇంటర్వ్యూ చిన్నాభిన్నం చేసింది. అలా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసిన ఆ ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేసేవాడంటే ?
అన్నగారిని గద్దేదించడానికి చంద్రబాబు చెప్పిన ఏకైక కారణం లక్ష్మీపార్వతి. అయితే జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా ‘ఆ కారణ జన్ముడిని స్మరించుకుందాం’ అనే శీర్షికతో ఒక టీవీ ఛానల్ ఇప్పుడు హడావిడి చేయడం చూస్తుంటే.. గతంలో అదే ఛానల్ ఆయనపై కక్ష కట్టి, చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి, ఎల్లో మీడియా అనే అస్త్రాన్ని వాడుకొని జనాలలో అనిశ్చితిని ఎలా సృష్టించిందో గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ని గద్దెదించే ముందు ఆయనకు వ్యతిరేకంగా అనేక వార్తలను ప్రసారం చేసిన సదరు ఛానల్ అప్పట్లో సాయంత్రం ప్రైమ్ టైం లో వార్తలను అందించేది. ఆ షో అప్పట్లో చాలా పాపులర్. అయితే ఆ సమయంలో ఇప్పటిలాగా లైవ్ గా వార్తలు వచ్చేవి కాదు. ఈరోజు వార్తలు సింగపూర్ నుంచి మరుసటి రోజు ప్రసారం అయ్యేవి.
Advertisement
అయితే ఎన్టీఆర్ ని దించడానికి ప్రధాన కారణం లక్ష్మీపార్వతి అని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా లక్ష్మీపార్వతి రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. తనకి ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమని లక్ష్మీపార్వతి ఒక ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కో కి, గట్టి షాక్ తగిలింది. కానీ ఈ వార్తని పక్కన పెట్టి అంతకు రెండు రోజుల క్రితం లక్ష్మీపార్వతి ‘ఎమ్మెల్యేలు పూచిక పుల్లతో సమానం’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేయడమే కాకుండా, ఆమె రాజకీయ విరమణ ప్రకటనని మరో రెండు రోజుల తర్వాత టెలికాస్ట్ చేశారు. దీంతో లక్ష్మి పార్వతి పాడిన రాజకీయ విరమణ అస్త్రం పూర్తిగా నిర్వీర్యం అయింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ ఎమ్మెల్యేలను సయోధ్యకు పిలిస్తే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. మేమంతా పూచిక పుల్లలం అనే ఎదురు దాడి జరిగింది. ఇలా ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.