Advertisement
తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు చిరంజీవి. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా ఒకటి. విజయ్ బాపినీడు దర్శకత్వంలో 1991 మే 9న విడుదలైన ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది.
Advertisement
అప్పటికే వరుస ఇండస్ట్రీ హిట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న చిరంజీవికి ఈ చిత్రం మరో హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రంతో మాస్ ఆడియన్స్ లో కూడా చిరంజీవికి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అందరూ ఈ సినిమా మూడ్ లో ఉండగానే.. విక్టరీ వెంకటేష్ “బొబ్బిలి రాజా” అనే సినిమాతో వచ్చాడు. బి.గోపాల్ దర్శకత్వంలో 1990 సెప్టెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్ గా పరిచయమైంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా.. డి రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించి వెంకటేష్ కి కూడా మాస్ ఇమేజ్ ని తీసుకువచ్చింది.
Advertisement
ఆ తర్వాత కూడా వెంకటేష్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 1992 జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం చంటి. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా మీనా నటించింది. ఈ చిత్రం 9 కోట్ల షేర్ వసూలు చేసి చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను సైతం అధిగమించింది. ఆ తర్వాత ఈ సినిమాను బీట్ చేస్తూ చిరంజీవి ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల షేర్ వసూలు చేసి అదే సంవత్సరంలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. అలా మొదటినుండి ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి ఫైట్ నడుస్తూ వచ్చింది.
Read also: ఆ ప్రాంతంలో జీడీపప్పు కేవలం 30 రూపాయలు మాత్రమే నట ఎక్కడంటే ?