Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ అంటే మనకు తెలిసినవారు ఏఎన్నార్,నాగార్జున, నాగచైతన్య,అఖిల్ మాత్రమే.. అయితే ఇందులో నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు.. అవును మీరు విన్నది నిజమే.. నాగచైతన్యకు తండ్రి పరంగా చూసుకుంటే ఒకే తమ్ముడు.. కానీ తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.. కానీ నాగచైతన్య మాత్రం ఇటు తండ్రి పరంగా అటు తల్లి పరంగా ఇద్దరు తమ్ములకు అన్నయ్య అయ్యారు. ఇకపోతే నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి ని వివాహం చేసుకుంటే నాగచైతన్య జన్మించాడు.
Advertisement
ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అమలను వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం మాత్రం అప్పట్లో పెద్ద సంచలనం గా మారింది.. వీరి తర్వాత ఈ దంపతులకు అఖిల్ జన్మించారు.ప్రస్తుతం అఖిల్ అడపాదడపా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ తన పనిలో తాను బిజీ అయిపోయాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఏజెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.
Advertisement
ఇదిలా ఉంటే తన భర్త నుంచి విడిపోయిన లక్ష్మీ మాత్రం శరత్ రాఘవన్ అనే చెన్నై కి చెందిన బడా వ్యాపార వేత్తను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత నాగచైతన్య కూడా అతని తల్లి దగ్గరే ఉండేవారు.. అలా కొద్ది రోజుల తర్వాత తన తండ్రి దగ్గరకు వచ్చారు నాగ చైతన్య.. ఆ తర్వాత లక్ష్మీ రాఘవన్ దంపతులకు కూడా ఒక అబ్బాయి పుట్టారు.. ఇతను కూడా నాగచైతన్యకు తమ్ముడు అవుతారు.. ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆయన కూడా గత కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకుని బిజినెస్ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది.. చెన్నైలో తన తండ్రి కి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి..
ALSO READ;