Advertisement
ద ఫ్యామిలీ మ్యాన్ అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో హిట్ అయిందో దాదాపు అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ సిరీస్ కి గుర్తింపు లభించింది. ఇది తొలుత మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్న కథ అని చాలా తక్కువ మందికి తెలుసు. చిరంజీవితో అశ్వినిదత్ కి ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు.. జగదేక వీరుడు సినిమా నుంచి ఉంది. చాలా సినిమాలను తీశారు. చివరగా జై చిరంజీవ సినిమా నిర్మించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించారట చిరంజీవి. ఫ్యామిలీ మ్యాన్ కథతో చిరంజీవి హీరోగా చేయాలనుకున్నారట అశ్వినిదత్.
Advertisement
Advertisement
ఈ కథ చిరంజీవికి స్టోరీ లైన్ నచ్చలేదని అశ్వినిదత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ కథను బాలీవుడ్ నటుడు మనో బాజ్ పాయి హీరోగా సిరీస్ గా నిర్మించిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఇలాంటి కథను చిరంజీవి ఎలా వదులుకున్నారని.. సోషల్ మీడియాలో అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మెగాస్టార్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు, సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read :
శ్రీదేవి ని రజినీకాంత్ మోసం చేశాడా ? అందుకే వీరికి బ్రేకప్ అయిందా ?