Advertisement
సాధారణంగా ఏ రంగంలోనైనా తమ కెరీర్ ముందుకు సాగాలాంటే మాత్రం ఎక్కడో ఒక చోట ప్రారంభం అనేది జరగాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది యాక్టర్స్ అంతకుముందు ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలుత సినిమాల్లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో కానీ.. సైడ్ రోల్స్ లో కానీ కనిపించి తరువాత మెల్లగా అవకాశం లభించినప్పుడు లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా లీడ్ రోల్స్ చేసే ముందు సైడ్ రోల్స్ లో కనిపించిన కొంతమంది నటీనటులు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కాజల్ అగర్వాల్ :
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె కళ్యాణ్ రామ్ తో జంటగా నటించిన లక్ష్మీ కళ్యాణ్యం సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అంతకు ముందే కాజల్ క్యూ హో గయానా అనే మూవీలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించారు.
సాయి పల్లవి :
సాయిపల్లవి తమిళంలో ప్రేమమ్ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ ఆ తరువాత తెలుగులో కూడా రీమెక్ చేశారు. నాగచైతన్య హీరోగా నటించారు. అయితే ప్రేమమ్ మూవీ కంటే ముందే సాయిపల్లవి తమిళంలో జయంరవి, కంగనా రనౌత్ జంటగా నటించిన ధామ్ ధూమ్ అనే మూవీలో ఓ పాత్రలో కనిపించారు. అదేవిధంగా కస్తూరిమాన్ అనే సినిమాలో కూడా ఓ పాత్రలో నటించారు సాయిపల్లవి.
త్రిష :
త్రిష 1983 మే 4న జన్మించింది. 1999 లో మిస్ చెన్నై పోటీలో గెలిచింది. 2002 లో మౌనం పేసియా దెలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతకుముందే జోడి సినిమాలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది. 2004లో వచ్చిన వర్షం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు, తమిళంతో పాటు తదితర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
కార్తీ :
తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజీ ఉన్న విషయం తెలిసిందే. కార్తీ నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతుంటది. కార్తీ అంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. సిద్ధార్థ్ కి కుడివైపు కార్తీ ఉంటారు.
సిద్దార్థ్ :
హీరో సిద్ధార్థ్ 2003లో బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. బాయ్స్ సినిమా కంటే ముందే సిద్ధార్థ్ మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కన్నతిల్ ముతమెటల్ అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు. ఈ మూవీని తెలుగులో అమృత అనే పేరుతో డబ్బింగ్ చేశారు.
అనసూయ :
జబర్దస్త్ షో తో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అనసూయ. ఈమె యాంకర్ తో పాటు చాలా సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే అంతకుముందే అనసూయ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో వచ్చిన రోల్ లో కనిపించారు.
Advertisement
విజయ్ దేవరకొండ :
విజయ్ దేవరకొండ ప్రస్తుతం చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న విజయ్.. టైగర్ సినిమా కాస్త నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమా కంటే ముందు రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా సినిమాలో.. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఈషా రెబ్బ తేజస్విని కూడా కనిపిస్తారు.
రవితేజ :
మాస్ మహారాజా రవితేజ సక్సెస్ స్టోరీ గురించి దాదాపు మనందరికీ తెలిసిందే. సినీ కెరీర్ ప్రారంభంలో రవితేజ ఫిలింనగర్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అని పలు సందర్భాల్లో చెప్పాడు. సినీ కెరీర్ ప్రారంభంలో రవితేజ సీతారామరాజు, అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి మూవీస్ లో సైడ్ రోల్స్ లో నటించారు రవితేజ. ఆ తరువాత శీనువాయిట్ల దర్శకత్వం వహించిన నీకోసం సినిమాతో హీరోగా మారిపోయారు.
విజయ్ సేతుపతి :
ప్రస్తుతం ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. సీరియల్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు విజయ్ సేతుపతి. అంతేకాదు నా పేరు శివతో పాటు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్లో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
జెడి చక్రవర్తి :
టాలీవుడ్ హీరో జెడి చక్రవర్తి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోగా, విలన్ గా రకరకాల పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా పరిచయం అవ్వకముందు నాగార్జున నటించిన శివ సినిమాలో కనిపించారు.
శివ కార్తికేయన్ :
శివ కార్తికేయన్ రెమో, సీమ రాజా వంటి సినిమాలతో తెలుగు వారికి పరిచయమయ్యాడు. అంతకుముందు ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాలో ధనుష్ ఫ్రెండ్ గా కూడా కనిపించారు. ఇతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు యాంకరింగ్ కూడా చేశారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
నవీన్ పోలిశెట్టి :
నవీన్ పోలిశెట్టి తోలుతా పలు యూట్యూబ్ వీడియోలు నటించాడు. ఇతను ఫస్ట్ సినిమా తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. 2019లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అయితే అంతకుముందే నవీన్ పోలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే వంటి సినిమాల్లో నటించారు. అలాగే డి ఫర్ దోపిడీ సినిమాలో కూడా నలుగురు హీరోలలో ఒకరిగా నటించాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
SR NTR FAMILY MEMBERS AND DETAILS: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
క్రికెటర్ శ్రీశాంత్ భార్య బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!