Advertisement
సెలబ్రిటీ జంటలలో ఈ మధ్య ఎక్కువగా ఫేమస్ అయిన వారిలో నరేష్, పవిత్ర లోకేష్ జంట అని చెప్పొచ్చు. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ని నాలుగో వివాహం చేసుకోబోతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. అతడి పెళ్లి వార్తలు బయటకు రాగానే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. నరేష్, పవిత్ర లోకేష్ ఓ హోటల్లో ఉంటే అక్కడికి సైతం రమ్య రఘుపతి వెళ్లి గొడవ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి నరేష్, పవిత్ర లోకేష్ ని అక్కడి నుండి పంపేశారు.
Advertisement
Read also: జీన్స్ ప్యాంట్ల పై ఉండే చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయంటే ?
ఇక అప్పటినుండి బయట ఎక్కువగా కనిపించని ఈ జంట తాజాగా.. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి లిప్ లాక్ వీడియోని షేర్ చేసి.. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే నరేష్ నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న నేపథ్యంలో మరి మూడో భార్య రమ్య రఘుపతి పరిస్థితి ఏంటి అని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రమ్యా రఘుపతికి, నరేష్ విడాకులు ఇచ్చి భరణం కూడా ఇవ్వబోతున్నారట. నరేష్ తన మూడవ భార్యకి భరణం కింద ఐదు కోట్ల రూపాయల ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం కేవలం ఐదు కోట్లకే రమ్య రఘుపతి ఎలా ఒప్పుకుంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈ క్రమంలోనే నరేష్ కి సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు వీరి వ్యవహారం పై స్పందించారు. రమ్య రఘుపతి, నరేష్ విడాకుల విషయం కోర్టులో పూర్తి అయిందని.. ఆమెకు భరణం కింద ఎంత ఇవ్వాల్సి వచ్చినా తాను ఇస్తానని నరేష్ తెలిపినట్లు చిట్టిబాబు వెల్లడించారు. నరేష్ కు తన తల్లి విజయనిర్మల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయి. అందుకే తాను కోట్లలో భరణం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని చిట్టిబాబు తెలిపారు. రమ్య రఘుపతి కుమారుడికి నరేష్ తల్లి ఇచ్చిన ఆస్తిలో వాటా ఉంటుందని, నరేష్ కష్టార్జితం విషయంలో అలా ఉండదని చిట్టిబాబు ఈ సందర్భంగా తెలిపారు.
Read also: లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్తిని కలిశానంటున్న శ్రీజ.. మెగా డాటర్ పోస్ట్ వైరల్