Advertisement
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తరం హీరోలలో సుమన్ కూడా ఒకరు.. అప్పట్లో సుమన్ సినిమా వచ్చింది అంటే చాలు అభిమానులకు ఎంతో ఆనందదాయకం.. తన నటనా చాతుర్యంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సుమన్. అప్పట్లో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.. ఆయన కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగారు. ఆయన కన్నడ,తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా 150 చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ఆయన ఇప్పటివరకూ సినీ కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు ఎన్నో ఉన్నాయి.
Advertisement
ALSO READ:హిందువులు ఎందుకు నుదిట “బొట్టు” పెట్టుకుంటారు ?
ముఖ్యంగా సుమన్ అన్నమయ్య మూవీ లో వెంకటేశ్వర స్వామి, రామదాసు సినిమాలో రాముడి పాత్ర చేసి ప్రేక్షకులను ఎంతో మెప్పించారు. 1980 దశాబ్దంలో సుమన్ తెలుగులో చిరంజీవి కి పోటీ ఇచ్చారంటే ఆయన రేంజ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తరంగిణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుమన్ కొన్ని అనివార్య కారణాలవల్ల జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయితే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నాపై రాజకీయ కుట్ర జరిగిందని అన్నారు. ఆ తర్వాత జైలు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోని లెజెండరీ డైరెక్టర్,రైటర్ డి.వి.నరసరాజు మనవరాలు శిరీషను ఇచ్చి వివాహం జరిపించారు.
Advertisement
అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుమన్ నిర్దోషి కాబట్టే డి.వి.నరసరాజు తన మనవరాలిని ఇచ్చి వివాహం చేశారు అని అందరూ భావించారు. పెళ్లి చేసుకున్న తర్వాత సుమన్ జీవితం మళ్ళీ దారిలోకి వచ్చింది. వివాహం చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మొండి మొగుడు పెంకి పెళ్ళాం, బావ బామ్మర్ది, పెద్దింటి అల్లుడు వంటి సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు..ఓ ఇంటర్వ్యూ లో సుమన్ మాట్లాడుతూ తన భార్య మంచిదని, తన వల్లే నాకు మళ్లీ అదృష్టం కలిసి వచ్చిందని సినిమా ఇండస్ట్రీలో రాణించానని తన గౌరవాన్ని తిరిగి దక్కించుకున్నానని అన్నారు.
ALSO READ: