Advertisement
ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అన్ని పరిశోధనలు వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి గొప్పగా చెప్పాయి. నడక వల్ల నాజుకు నడుమే కాదు, నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.
Advertisement
Also Read: “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?
#1 రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం శారీరకంగా చురుకుగా ఉండేవారికి కోరోనరీ హార్ట్ డిజిసెస్ ముప్పు తక్కువ అని, కార్డియో వాస్క్యులర్ డిజిస్ వల్ల మరణం సంభవించే అవకాశం తక్కువట.
Advertisement
#2 రోజు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, అస్తమా కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది.
#3 రోజు వాకింగ్ చేయడం వల్ల ఫీల్ గుడ్ ఎండార్పిన్లు విడుదల అవుతాయి. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. యాంగ్జైటీ నీ తగ్గిస్తుంది.
#4 ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది.
#5 బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. దీనికి డైటింగ్ చేసే అవసరం లేదు. కేవలం ప్రతిరోజు 30 నిమిషాలు నడిచి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
#6 ప్రతిరోజు వాకింగ్ చేస్తే, మనిషి ఎంతో సంతోషంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
Also read: SR ఎన్టీఆర్ కు ఒక్క హైదరబాద్ లోనే ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయో తెలుసా..?