Advertisement
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ వృత్తికి బ్రాండ్ అంబాసిడర్ సుమా కనకాల. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై తిరుగులేని మహారాణిగా ఆమె రాణిస్తుంది. ఈవెంట్ ఏదైనా సుమ ఉంటే ఆ సందడే వేరు. ఈ మాటల మంజరి రాజీవ్ కనకాలను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ – రాజీవ్ కనకాల ఒకరు. వీరిద్దరూ తమ తమ ప్రొఫెషన్స్ లో సక్సెస్ఫుల్ గా సాగిపోతున్నారు. 1999 ఫిబ్రవరి 10వ తేదీన వీరి వివాహం జరిగింది.
Advertisement
Read also: పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?
Advertisement
ఓ స్టూడియోలో ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారింది. ఒకరింటే ఒకరికి ఇష్టం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే సుమ గతంలో ఒకసారి తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ.. తన భర్త రాజీవ్ కనకాల తో ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 1994వ సంవత్సరంలో వీరి ప్రేమ ప్రయాణం మొదలైంది. మొదట రాజీవ్ కనకాల ప్రపోజ్ చేశారు. అయితే సుమ మొదట్లో రిజెక్ట్ చేసి ఆ తర్వాత ఓకే చేసిందట. అప్పుడు రాజీవ్ కూడా సుమకి ఒక కండిషన్ పెట్టాడట. అదేంటంటే.. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేయాలని అన్నాడు.
దాంతో సుమ పెళ్లి చేసుకోను అని చెప్పి రాజీవ్ కనకాలతో సంవత్సరం నరపాటు మాట్లాడలేదట. ఇక ఆ సమయంలో మరో మూడు సినిమాలలో నటించింది సుమ. అయితే ఆ చిత్రాలు ఫ్లాప్ కావడంతో సుమకి సినిమా రంగం నచ్చలేదట. ఇక అప్పటినుండి సినిమాలను వదిలేసి రాజీవ్ కనకాలతో మాట్లాడి తమ ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాసు కనకాలను ఒప్పించి 1999లో పెళ్లి చేసుకున్నారు. ఇక సుమ, రాజీవ్ విడిపోయారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అవి పుకార్లేనని వారు స్పష్టం చేశారు.
Read also: ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్