Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఎన్నో భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర పరిశ్రమ. ఇందులో లవ్, యాక్షన్ మరియు క్రైమ్ ఇతర సినిమాలు కూడా ఉన్నాయి. ఒక భాషలో హిట్ కొట్టిన సినిమాను పలు భాషలలోకి రీమేక్ చేయడం లేదంటే డబ్బింగ్ చెప్పి విడుదల చేయడం జరుగుతాయి. అయితే ఓ సినిమా పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల జనాలకు పరిచయం చేసేందుకు దర్శక నిర్మాతలు డబ్బింగ్ చేయిస్తారు. అలా ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చిన ఎన్నో సినిమాలను తెలుగు జనాలు ఆదరించారు కూడా. ఆయా సినిమాల్లో నటించిన ఇతర సినిమా పరిశ్రమకు చెందిన సినిమా తారలు కూడా తెలుగు జనాలకు దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంతకీ తెలుగులోకి డబ్బింగ్ అయిన తొలి సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Advertisement
1931 కి ముందు తెలుగు సినిమా తెరపై మాటలు వినిపించేవి కాదు. మూకీ సినిమాలు మాత్రమే వచ్చేవి. ఈ సినిమాలు సైతం జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే 1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలు రావడం మొదలైంది. 1950లో డబ్బింగ్ సినిమాల సందడి పెరిగింది. అలా తెలుగులోకి వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఆహుతి. 1946లో బాలీవుడ్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న నీరా ఔర్ నందా సినిమా.. తెలుగులోకి 1950 జూన్ 22న ఆహుతి పేరుతో విడుదలైంది.
Advertisement
జయసింహ, రూప్ బసంత్, శశి,నిషి భరన్ సహా పలువురు నటించారు. ఈ సినిమాను జూన్నాకర్ తెరకెక్కించాడు. తెలుగులో ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన చేశాడు. ఈ సినిమాతోనే మహాకవి శ్రీ శ్రీ వెండితెరకు పరిచయం అయ్యాడు.మాటలు, పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు లేని మాటలు తొలిసారి వెండితెరపై వినిపించడంతో జనాలు మంచి అనుభూతికి లోనయ్యారు. నెమ్మదిగా తెలుగులోకి డబ్బింగ్ సినిమాల రాక మొదలయ్యింది. 1953లో ప్రేమ లేఖలు… ఆ తర్వాత రోహిణి సహా పలు బాలీవుడ్ సినిమాలు తెలుగు లోకి వచ్చి సందడి చేశాయి. ఆ తర్వాత ఇతర భాషల నుంచి కూడా పలు రీమేక్ సినిమాలు వచ్చాయి.
ALSO READ;
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?