Advertisement
ఈ సమాజంలో నిజాయితీగా బతకడం చాలా కష్టం. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పడం సర్వసాధారణం. అంతెందుకు అబద్దాలు చెప్పి మోసాలు చేసేవారినే బాగా నమ్ముతుంది ఈ సమాజం. నమ్మకంగా మంచి పనులు చేసే వారిని ఎక్కువ శాతం జనాలు చులకనగా చూస్తారు. అయితే ఇండియాలో ఎక్కువమంది చెప్పే అబద్ధాల విషయమై తాజాగా ఓ సర్వే చేశారు. ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
* నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు: కొంతమంది వారి దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ నా దగ్గర రూపాయి లేదని చెబుతుంటారట.
* నువ్వే నా ఫస్ట్ లవ్: ఎవరినైనా ప్రేమించినప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి చాలా అబద్దాలు చెబుతారట. నువ్వే నా ఫస్ట్ లవ్ అంటూ ఎవరితో లవ్ లో పడితే వారితో అంటుంటారు. ఇది కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు వాడతారట.
* రేపటినుండి మందు, సిగరెట్ మానేస్తా: మందు లేదా సిగరెట్ కి బాగా ఆడిక్ట్ అయిపోయిన వారు దాన్ని మానేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది మానడం వాళ్ళ వల్ల కాదు. చాలా మంది మిత్రులు, కుటుంబ సభ్యులతో రేపటినుండి మందు, సిగరెట్ తాగను అని చెబుతూ ఉంటారు.
Advertisement
* నాకు పని ఉంది రాలేను: ఎక్కడికైనా వెళ్లడానికి ఇష్టం లేనప్పుడు అలవోకగా ఈ అబద్ధం వాడుతూ ఉంటారు.
* అబద్ధం చెప్పను: కొంతమంది అబద్ధాలు చెబుతూనే నేను అసలు అబద్ధం చెప్పనని అంటుంటారు. కానీ వారు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూనే ఉంటారు.
* ఫోన్ సైలెంట్ లో ఉంది: కొంతమంది ఎదుటి వ్యక్తితో ఫోన్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే.. ఫోన్ సైలెంట్ లో ఉందని అబద్ధం చెబుతుంటారు. వారు ఫోన్ చూసి కూడా ఈ అబద్ధాన్ని వాడతారు.
* జ్వరం వచ్చింది: ఇక స్టూడెంట్స్ ఎక్కువగా చెప్పే అబద్ధం “నాకు జ్వరం వచ్చింది సార్.. అందుకే స్కూల్ కి రాలేకపోయాను” అని చెబుతుంటారట.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు !
ALEKYA REDDY: భర్త కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైన అలేఖ్య రెడ్డి.. !
పేరెంట్స్ పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడని ఈ 3 మాటలు.. 2వది చాలా ఇంపార్టెంట్..!!