Advertisement
Anchor suma Kanakala: యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమా. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. సుమా ప్రజా ధారణ పొందిన తెలుగు టెలివిజన్ యాంకర్లలో ఒకరు. ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్క బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.
Advertisement
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించారో తెలుసా..?
కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, యాంకరింగ్ చేస్తూ, ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళం లతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోనూ మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సలే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపును పొందింది.
Advertisement
టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల ఆడియో రిలీజ్ కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కానీ సుమ నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే సుమ యాక్టర్ రాజీవ్ కనకాల భార్య అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక యాంకర్ సుమ వయసు విషయానికి వస్తే.. 1974 మార్చి 22వ తేదీన కేరళ లో జన్మించారు. ఈ లెక్కన సుమ వయస్సు 48 సంవత్సరాలు నడుస్తోంది. అయినప్పటికీ… చాలా యాక్టింగ్ యాంకరింగ్ చేస్తుంది ఈ బ్యూటీ.
Read also: జీవిత భాగస్వామిని ఇలా ఎంపిక చేసుకోకుంటే జీవితం లో కష్టాలు తప్పవట !