Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీని ఎవరూ ముందుడి నడిపిస్తారనే చర్చ ఓవైపు.. మరోవైపు ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడం లేదని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాలయ్య టీడీపీ బాధ్యతలు తీసుకుంటారని.. బ్రాహ్మణి రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబుపై కేసుల మీద కేసులు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది సీఐడీ. చంద్రబాబు అరెస్ట్ కారణంగా తమకు రాజకీయంగా లాభం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Advertisement
వీటిని కూడా చదవండి: పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తీసుకున్నారు.. ఈ పోలీస్ జంటపై షాకింగ్ రియాక్షన్ తీసుకున్న సిపి..!
Advertisement
తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి తమను గెలిపిస్తున్నాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికలు ముందస్తు జరుగుతాయా ? షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అనే దానిపై చాలా కాలం నుంచి చర్చ కొనసాగుతుంది. మంత్రి వర్గ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందనే కొత్త చర్చకు తెరలేపాయి. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా ఆలోచన చేపడుతున్న తరుణంలోనే అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో ఎన్నికలపై సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టయితే అందుకు తగినట్టుగానే రాష్ట్రంలో కూడా ఎన్నికలు వస్తాయని మంత్రులకు సూచించారు సీఎం జగన్.
వీటిని కూడా చదవండి: విజయ్ ఆంటోనీ గారు చేసిన ఆ చిన్న పొరపాటు వల్లనే కూతురు దూరమయ్యారా?
ఎన్నికల విషయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు మంత్రులకు సూచనలు చేయాల్సిన అవసరముందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాటితో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనకు సీఎం జగన్ వచ్చారని.. అందుకే మంత్రులకు ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ కేబినెట్ భేటీ ప్రధానంగా ఎన్నికలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలో ఆసక్తికరంగా మారాయి.