Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్న విషయం విధితమే. సైమా వేడుకలకు దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ కి చేరుకున్నారు. సైమా వేడుకల సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించని ఎన్టీఆర్.. చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా.. అది వాస్తవం కాదని సమాచారం. నిజానికి ఎన్టీఆర్ కనుక స్పందించాలనుకుంటే.. ఎప్పుడో స్పందించేవారట.
Advertisement
ఇవి చదవండి: చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్..!
గతంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాల వల్ల ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో చాలా సైలెంట్ గా ఉన్నారని.. అంతకుమించి చంద్రబాబు అరెస్ట్ గురించి ఎన్టీఆర్ ఎలాంటి కారణాలు లేవని సమాచారం. అయితే రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఎన్టీఆర్ జోక్యం చేసుకునే అవకాశముందని సమాచారం.సినిమాల్లోనే తన కెరీర్ కొనసాగించాలని.. పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నాడు.
Advertisement
ఇవి చదవండి: చంద్రబాబు డ్రీమ్స్ కు జగన్ బ్రేక్.. అసలు కారణం అదేనా ?
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. దేవర మూవీ షూటింగ్ తో బిజీ కానున్నారు. దాదాపు నవంబర్ చివరి వారం వరకు దేవర షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. దేవర మూవీ తరువాత మరో పాన్ ఇండియా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.