Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి టాపిక్ కూడా ఒకటి. నాగశౌర్య త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూషతో నాగశౌర్యకు వివాహం నిశ్చయమైంది. ఇంతకీ ఎవరు ఈ అనూష?, నాగశౌర్యకి ఈమెకి మధ్య ఎలా పరిచయం అయింది? ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కి కాబోయే భార్య అనూష కి రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
Advertisement
Read also: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే
కర్ణాటక రాష్ట్రం మంగుళూరు దగ్గరలోని కుందాపూర్ లో జన్మించింది అనూష శెట్టి. ఈమె ఇంటీరియర్ డిజైనింగ్ లో నిష్ణాతురాలు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ గా కూడా ఈమె అవార్డు అందుకుంది. ఇక నాగశౌర్యకు అనూషతో బెంగుళూరులో పరిచయంం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. బెంగళూరులోని జెడబ్యూ మారియట్ లో ఈనెల 20వ తేదీన ఉదయం 11:25 గంటలకి వీరి వివాహం జరగనుంది. నవంబర్ 19వ తేదీన మెహందీ ఫంక్షన్ తో పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ అమ్మాయికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లికి ఓ దగ్గరి సంబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి శాలినిది కర్ణాటకలోని విద్వాంసుల కుటుంబం.
Advertisement
మంగుళూరుకు సమీపంలోని కుందాపూర్ ఆమె స్వస్థలం. ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన “కాంతారా” మూవీ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా ఈ ఊరికి చెందినవారే. అయితే ఇప్పుడు నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టిది కూడా ఇదే ఊరట. ఇలా వీరందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు కావడం విశేషం. ఇక నాగశౌర్య అంటే ఎన్టీఆర్ సతీమణి ప్రణతికి కూడా ఎంతో ఇష్టమట. ఎంతలా అంటే.. నాగశౌర్య నటించిన సినిమాలోని ఓ పాటను ఆమె రింగ్ టోన్ గా పెట్టుకునేంత. ఇక నాగశౌర్యకు ఇష్టమైన హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 20వ తేదీన పెద్దల సమక్షంలో నాగశౌర్య – అనూష శెట్టి ఒక్కటి కాబోతున్నారు.