Advertisement
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీతోనే స్టార్ గా మారలేదు. మొదట్లో ఆయన విలన్ గా నటించి.. ఆ తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో ఎం రాజశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘పున్నమి నాగు’ చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు నరసింహారాజు, రతి, అగ్నిహోత్రి, దూళిపాల, జయమాలిని, పద్మనాభం తదితరులు నటించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నాగులు పాత్రలో నటించారు.
Advertisement
READ ALSO : దగ్గుబాటి ఫ్యామిలీలో ఈ హీరో ని గుర్తు పట్టారా ? అతను ఎవరంటే ?
అయితే చిరంజీవి సరసన పూర్ణిమ పాత్రలో మేనక నటించింది. ఈ మేనక ఎవరో కాదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తి సురేష్ తల్లి. మేనక అయ్యంగార్ కన్యాకుమారిలోని నాగర్ కోయిల్ లో జన్మించారు. ఆమె 1979లో తమిళ చిత్రం ‘రమాయి వయసుక్కు వస్తుట్టా’ తో సిని అరంగేట్రం చేసింది. 1980 నుంచి 1987 వరకు ఆమె మొత్తం 125 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవితో పున్నమి నాగులో నటించారు. ఆ తర్వాత 1982లో ‘సుబ్బారావుకు కోపం వచ్చింది’ సినిమాలో దుర్గా పాత్రలో కనిపించారు.
Advertisement
నటిగానే కాకుండా నిర్మాతగా మేనక పలు చిత్రాలను నిర్మించారు. ఆమె కూతురు కీర్తి సురేష్ తెలుగులో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో తల్లి మేనక హీరోయిన్గా నటించగా, కూతురు కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ‘బోళాశంకర్’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ మూవీ ‘వేదాళం’కు రీమేక్ అవుతున్న మెగాస్టార్ మెయిన్ రోల్ లో నటించడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
READ ALSO : అమ్మాయిలు.. ర్యాపిడో బైక్ పై వెళుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే..!!