Advertisement
దేశ ప్రజలందరి బాగోగులను చూసే ప్రధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది. ఆపద ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కాబట్టి.. ఏ రూపంలో ప్రమాదం వచ్చిన ఎదుర్కొని ప్రధానిని కాపాడగలిగే సెక్యూరిటీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ గ్రూప్ ఏది? వారి ఎంపిక జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం…
Advertisement
Read also: రంజితమే పాటలో “రష్మిక” కి మించి అదరగొట్టిన ఈ క్యూట్ భామను గుర్తుపట్టారా ?
ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) మొదటగా సెక్యూరిటీ బాధ్యతలు చూసుకుంటుంది. రెండో సర్కిల్ వ్యక్తిగత గార్డులు. మూడవ సర్కిల్ ఎన్ఎస్జి కమాండోలు ఉంటారు. వీరు ఏ ఆపదలోనైనా సులువుగా పనిచేస్తారు. దేశంలోని అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలలో అత్యుత్తమమైన సెక్యూరిటీ గ్రూప్ అయిన ఎస్పీజీ నుండి ఎంపిక చేస్తారు. ఇందులో రక్షణ దళం నుండి మెరుగైన అధికారులను ప్రధాని భద్రత సిబ్బంది గా తీసుకుంటారు. ఇంతకుముందు టాస్క్ ఫోర్స్ నుండి తీసుకునేవారు. అయితే ఇందిరా గాంధీని తన అంగరక్షకులు చంపడంతో కేంద్రం ప్రధాని రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పటిష్టం చేసింది.
Advertisement
సెక్యూరిటీ కోసం తీసుకున్న అభ్యర్థులను సంవత్సరం తర్వాత మార్చేస్తారు. అంటే ప్రతి ఏడాది అధికారులు మారుతూ ఉంటారు. వీళ్లందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రధాని వెళ్లే రూట్ ను మూడు రోజుల ముందే గుర్తిస్తారు. అయితే ఈ సెక్యూరిటీ అధికారుల జీతభత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికారుల పదవిని బట్టి లక్ష నుండి రెండున్నర లక్షల వరకు జీతాలు ఉంటాయి. అలవెన్స్ లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి కాక డ్రెస్ అలోవెన్స్ 25 వేల వరకు ఉంటుంది. ప్రధాని ఇంటి నుండి బయటకు వచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తారు ఈ సెక్యూరిటీ గ్రూప్స్. ఇక ప్రధాని ఒకరోజు భద్రత ఖర్చు దాదాపు కోటిన్నర రూపాయలు ఉంటుందని సమాచారం.
Read also: లైకుల కోసం మరీ ఇంతలా..! ఈ జంట చేసిన పనికి నెటిజెన్లు ఏమంటున్నారంటే..?