Advertisement
తెలుగుదేశం పార్టీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి తారకరత్న నడుస్తూ ఉండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుండి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
Advertisement
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?
ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి తిరిగి వస్తారని అనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల ప్రార్థనలు మాత్రం ఫలించలేదు. సుదీర్ఘంగా 23 రోజులపాటు మరణంతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న 9:40 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాలలో విషాదాన్ని నింపింది. తారకరత్న – అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు. మొదట కుమార్తె, తర్వాత కవల పిల్లలు ( పాపా – బాబు) పుట్టారు. అయితే తాత ఎన్టీ రామారావు పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టుకుని తాత గారి మీద ప్రేమను చాటుకున్నారు తారకరత్న.
Advertisement
పెద్ద పాప పేరు నిషిక (N), కుమారుడు తనయ్ రామ్ (T), రెండో పాప పేరు రేయా (R)… ఇలా NTR అని అర్థం వచ్చేలా తమ చిన్నారులకు తాత పేరు పెట్టుకుని తాత గారి మీద ప్రేమను చాటుకున్నారు. అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1996 జనవరి 18న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. తారకరత్న కూడా అదే తేదీన ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున శివైక్యమయ్యారు. అంటే తాత మరణించిన నెల రోజులకు అదే తేదీన కాలం చేశారు. 40 ఏళ్లు కూడా నిండకుండానే తారకరత్న మరణించడం అందరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు చనిపోయారు తారకరత్న. ఫిబ్రవరి 22న తారకరత్న జయంతి. దానికి నాలుగు రోజుల ముందే ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.
Read also: తారక్ తరహాలో ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీరే!