Advertisement
ప్రతి రోజూ మనం బియ్యం వండుకుంటూ ఉంటాం. అయితే మనకే కాదు ప్రపంచంలో దాదాపు 50 శాతం మంది జనాభా రోజు అన్నం తింటారు. ఆసియా దేశాల్లో అగ్రభాగం బియ్యనిదే. అయితే అన్నాన్ని ఆహారంగా మనం తీసుకుంటూ ఉంటాం. కానీ బియ్యానికి సంబంధించి పలు విషయాలు చాలా మందికి తెలియదు. తొమ్మిది వేల ఏళ్ల కిందటి నుంచి వారిని సాగు చేస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. బియ్యానికి అంతటి చరిత్ర ఉందట. సుమారు లక్షకు పైగా బియ్యాల్లో రకాలు ఉన్నాయట. మనకి మామూలుగా బ్రౌన్ రైస్ సన్న బియ్యం ఇలా కొన్ని రకాలు మాత్రమే తెలుసు. కానీ ఇన్ని రకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు.
Advertisement
అయితే బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యకరం. దీనిని తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు. అలాగే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. బియ్యాన్ని సౌందర్య సాధన ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తారు. అందుకని బియ్యాన్ని మనం జుట్టు లేదా చర్మానికి కూడా వాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 500 మిలియన్ల టన్నులకు పైగా వరిని పండిస్తున్నారట. మొక్కజొన్న తర్వాత ఎక్కువగా సాగు చేయబడే పంట బియ్యనిదే.
Advertisement
Also read:
జపాన్ వారు బియ్యాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. శుభకార్యాలకు కచ్చితంగా బియ్యంతో వంటకాలు తయారు చేస్తారు. థాయిలాండ్ వాసులు సన్యాసులకు బియ్యాన్ని భిక్ష వేస్తారు. ఇలా చేయడం వలన మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం ఏడాదికి రెండుసార్లు వరి పంటను చాలా చోట్ల పండిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే మూడుసార్లు కూడా వేస్తారు. అన్నింటి కంటే బాస్మతి రైస్ లో పోషకాలు ఎక్కువ ఉంటాయట. ఫైబర్ కావాలంటే మాత్రం బ్రౌన్ రైస్ ని తప్పక చేసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!