Advertisement
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ జానర్ లో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ యుర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతంలో రూపొందిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో బాలయ్య నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కు పరిటాల రవి కారణమని తెలిసి బాలయ్య అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Advertisement
Read also: SS రాజమౌళి తీసిన సినిమాల్లో భార్య రమా రాజమౌళి గారికి అస్సలు నచ్చని సినిమా ఏదంటే ?
Advertisement
ప్రతి దర్శకుడు తన జీవితంలో వేరువేరు సందర్భాలలో విన్న ఘటనల ఆధారంగా సినిమా కథలని సిద్ధం చేసుకుంటారు. అలాగే గోపీచంద్ మలినేని కూడా పరిటాల రవి గురించి విన్న, చూసిన, తెలిసిన విషయాల ఆధారంగా వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విరసింహారెడ్డి పాత్రను డిజైన్ చేసేటప్పుడు తన మనసులో ఉన్నది దివంగత పరిటాల రవీంద్రా అని వెల్లడించారు. దర్శకుడు పరిటాల రవీంద్ర సిగరెట్ తాగే స్టైల్, డేరింగ్ యాటిట్యూడ్ వంటి కొన్ని నిజ జీవిత సంఘటనలను తీసుకొని వీరసింహారెడ్డి పాత్రకు జోడించానని వెల్లడించారు. పరిటాల రవి జీవించి ఉండగా పోలీసులు ఆయన జీపును తనిఖీ చేస్తున్నప్పుడు ఆయన ఏమీ పట్టించుకోకుండా స్టైల్ గా సిగరెట్ తాగారని పేర్కొన్నారు.
ఆ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీర సింహారెడ్డి ఇంటర్వెల్ సీన్ లో బాలయ్య చుట్ట తాగుతూ చనిపోయేలా ప్లాన్ చేశానని వివరించారు గోపీచంద్ మలినేని. పరిటాల రవి మీద ఎటాక్ జరగడం కంటే ముందు ఆయనను అమెరికాకు ఆహ్వానించారని, కానీ ఆయన వెళ్లలేదని తెలిపారు. పరిటాల రవి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలా ఆయన పాత్రను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చు అని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Read also: SUREKHA VANI PHOTOS : ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నటి సురేఖ వాణి రేర్ ఫోటో గ్యాలరీ..!!