Advertisement
తెలుగులో క్యూట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అందాల అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ చిత్రంతో మొదటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. దీని తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అంతకుముందే ఈమె ప్రేమమ్ మూవీతో సౌత్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది కార్తికేయ 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ ను సొంతం చేస్తుకుంది.
Advertisement
also read:“చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !
వాస్తవానికి అనుపమ మలయాలి ముద్దుగుమ్మ అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పటికే ఆమె శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అలాంటి ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Advertisement
also read:“చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !
ఈ క్రమంలోనే తాజాగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కొప్పున మల్లెపూలు పెట్టుకొని ఎల్లోసారి కట్టుకొని దానికి మ్యాచింగ్ గ్రీన్ బ్లౌజ్ ధరించి కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అందం గురించి చాలామంది అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
also read:Mahesh Babu and Ntr: మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !