Advertisement
అనాది కాలం నుంచి గోరింటాకు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమైపోయింది. అన్ని శుభకార్యాల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. స్త్రీలు గోరింటాకును తమ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. గోరింటాకు లో చర్మానికి మేలు చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి.
Advertisement
ఆ రసాయనాలు మన శరీరానికి చల్ లదనాన్ని ఇవ్వడమే కాక అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. గోరింటాకు వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. గోరింటాకు లో ఉండే లాసోన్ అనే సహజసిద్ధమైన రసాయనం వల్ల దీన్ని పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండుతుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న నీటిని మన శరీరం గ్రహించి ఆవిరి చేస్తుంది. దానితో గోరింటాకు ఎండి కాసేపటికి మన శరీరంలోని పొరల్లోకి చొచ్చుకు వెళ్లి ఎర్రగా మారుతుంది.
Advertisement
ఇక ఆషాడమాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే.. ఆషాడం వర్షాకాలం కాస్త ఊపందుకోగానే వస్తుంది. ఈ సమయంలో మన కాళ్లు చేతులు వర్షపునీటిలో నాని చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు దరిచేరకుండా గోరింటాకు అడ్డుకుంటుంది. అలాగే వేసవి కాలంలో ఎండ వేడిమిని గ్రహించిన శరీరం వర్షాకాలంలో ఒక్కసారిగా చల్లబడి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మన ఒంటి లోని ఉష్ణాన్ని గ్రహించి వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది.