Advertisement
సాధారణంగా చాలామంది ఒకరి దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. దుస్తులు చిన్నగా అయిపోయాయని అవి వేరే ఒకరికి ఇవ్వడమో.. లేదా మరొకరికి చిన్నగా అయిపోయిన దుస్తులను మనం ధరించడమో చేస్తూ ఉంటాం. అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, దగ్గర బంధువులు, స్నేహితులు ఇలా చాలామంది ఒకరి బట్టలు మరొక్కరు వేసుకుంటూంటారు. అయితే ఇలా ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం మంచిది కాదట. ఒకరి దుస్తులు మరొకరు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకరి దుస్తులను మరొకరు ధరించడం వల్ల కలిగే నష్టాలు శాస్త్రంలో ఈ విధంగా రాసి ఉన్నాయి.
Advertisement
Advertisement
పూర్వం దేవయాని, శర్విస్ట్ర అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. శర్వీస్ట్రా క్షత్రియుల అమ్మాయి కాగా.. దేవయాని బ్రాహ్మణుల అమ్మాయి వీరిద్దరూ ఒకరోజు స్నానానికైై నదికి వెళ్లారు. వారు నదిలో స్నానం చేసి నది నుండి బయటకి వచ్చాక.. బట్టలు మారిపోయి ఒకరి దుస్తులను మరొకరు వేసుకోబోయారు. శర్విస్ట్ర దుస్తులను దేవయాని కట్టుకోబోయింది. దాంతో ఆగ్రహించిన శర్విస్ట్రీ, దేవయాని కట్టుకున్న వస్త్రాన్ని తీసివేస్తూ ఉండగా దేవయాని వివస్త్రగా నదిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న యయాది మహారాజు రక్షించమని దేవయాని అన్న అరుపులని విని అటువైపుగా చూసాడు. తన భుజంపై ఉన్న కండువాని నదిలోకి వేశాడు యయాది మహారాజు. ఆ తర్వాత దేవయాని చేయి పట్టుకొని బయటకి లాగి రక్షించాడు. అయితే పూర్వం చెయ్యి పట్టుకుంటే వివాహం చేసుకున్నట్లేనని ఆచారం ఉండేది.
దీంతో దేవయానికి యాయాజు మహారాజుని వివాహమాడక తప్పలేదు. అయితే దేవయాని శర్విస్ట్రీ దుస్తులను ధరించినందుకే ఇలా జరిగిందని అంటారు. అందుకే ఎవరి వస్త్రాలను వారు ధరించక పోతే అనార్దాలు జరుగుతాయని.. అరిష్టం కూడా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక ఒకరి దుస్తులను మరొకరు వేసుకోవడం చేత దోషాలు అంటుకుంటాయని.. అలా బట్టలు ఇచ్చిన వారికి మాత్రమే కాక తీసుకున్న వారు కూడా దోషాలకు గురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Read also: టాలీవుడ్ లో బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే!