Advertisement
టాలీవుడ్ లో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి, చూడాలనివుంది, ఇంద్ర వంటి చిత్రాలు హ్యాట్రిక్ సక్సెస్ ని అందించాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి అశ్వనీదత్ కాంబినేషన్ అంటే మంచి క్రేజ్ ఏర్పడింది.
Advertisement
ఇక వీరిద్దరి కాంబినేషన్లో జై చిరంజీవ చిత్రానికి అప్పటికే ఫాంలో ఉన్న త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ పని చేస్తుండటంతో అందరిలోనూ మరింత అంచనాలు పెరిగాయి. కానీ జై చిరంజీవ చిత్రం అనుకున్న దానికి విభిన్నంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఓ ఇంటర్వ్యూలో జై చిరంజీవ సినిమా ఎందుకు డిజాస్టర్ గా నిలిచింది అనే విషయంపై అశ్వనీదత్ మాట్లాడారు. సమీరా రెడ్డి ఓ ఐరన్ లెగ్, ఆమెను త్రివిక్రమ్ పెట్టుకోమన్నాడని ఆమెను దృష్టిలో పెట్టుకునే సీన్లు రాశాను. ఇక త్రివిక్రమ్ కి నువ్వే నువ్వే సినిమా అవకాశం రావడంతో జై చిరంజీవ చిత్రాన్ని పట్టించుకోవడం మానేశాడు.
Advertisement
రాసుకున్న కథలో మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఆమెతో చేసిన ఒక సీన్ కూడా బాగా రాలేదు. మణిశర్మ కూడా ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించలేదు. దానితో సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక సమీరా రెడ్డి నటించిన అశోక్ పరవాలేదు అని అనిపించినా జై చిరంజీవ, నరసింహుడు చిత్రాలు భారి డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో సమీరా రెడ్డి ఇండస్ట్రీలో కనపడకుండా పోయిందని అశ్విత చెప్పుకొచ్చారు.
అలా నాలుగో సినిమా ఫ్లాప్ కావడంతో, మరో ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించి ఖైదీ నెంబర్ 150 హిట్ అందుకున్నాము . ఆ తరువాత రాజ్ అండ్ డీకేలు ఫ్యామిలీ మెన్ కథను చిరంజీవి కోసమే రాశారు.. ఇక ఆ కథ చిరంజీవికి వినిపిస్తే తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఒక వేళ ఆ సినిమా చిరంజీవి చేసి ఉంటే ఇంకో స్థాయిలో ఉండేదంటూ అశ్వనీదత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read :
శ్రీదేవి ని రజినీకాంత్ మోసం చేశాడా ? అందుకే వీరికి బ్రేకప్ అయిందా ?
‘ద ఫ్యామిలీ మ్యాన్’ స్టోరీ చిరంజీవి కోసం రాశారనే విషయం మీకు తెలుసా ?
ఊర్వశి రౌతెలా నిమిషానికి కోటి రూపాయలు పారితోషకం తీసుకుంటుందా..? నెటిజన్స్ ఏమన్నారంటే ?