Advertisement
భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో? వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? అసలు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందాం..
Advertisement
కాయగూరలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిల్వ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అంత కెపాసిటీ కలిగిన బూడిద గుమ్మడికాయని మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మం పై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. నరఘోష, నర పీడలు, నరదృష్టి ఏంటి అనేక దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుందని చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరు ఇంటిముందు గుమ్మడికాయ కట్టుకోవాల్సిన అవసరంం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఇంటిపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండడం కోసం చాలామంది ఇంటి గుమ్మం దగ్గర బుడిద గుమ్మడికాయలు కడతారు.
Advertisement
అయితే ఈ గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఎప్పుడైనా గుమ్మడికాయను కట్టాలనుకుంటే ముందు రోజు సాయంత్రమే దానిని తీసుకొచ్చి తరువాతి రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి. గుమ్మడికాయకు పసుపు, కుంకుమ రాసి ఇంటి ముందు వేలాడదీసుకోవాలని చెబుతున్నారు. ఈ విధంగా గుమ్మడికాయ కట్టిన తర్వాత ప్రతిరోజు మనం పూజ చేసేటప్పుడు రెండు అగరోత్తులని వెలిగించి ధూపం వేస్తే ఏ విధమైన చెడు ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు గుమ్మడికాయని కట్టడం కోసం ప్రత్యేకమైన దినాలు కూడా ఉన్నాయి. బుధవారం, గురువారం, లేదా ఆదివారం నాడు గుమ్మడికాయని కట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.