Advertisement
యంగ్ హీరో కిరన్ అబ్బవరం కెరీర్ ప్రారంభంలో మంచి గుర్తంపు సంపాదించుకున్నాడు. రాజా వారు రాణి గారు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రెండో సినిమా ‘SR కళ్యాణమండపం’తో కమర్షియల్ హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన ప్రయత్నాలు విమర్శలకు గురయ్యాయి. కిరణ్ కమర్షియల్ హీరో అయిపోదాం అనుకుంటున్నాడని.. అది అంత ఈజీ కాదంటూ విమర్శలు గుప్పించారు. ‘మీటర్’ సినిమా వచ్చిన తరవాత అయితే కిరణ్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
Advertisement
Advertisement
.ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. గోపీచంద్ ‘ఆక్సిజన్’ తరవాత మళ్లీ జ్యోతి కృష్ణ మళ్లీ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం తన పేరును రత్నం కృష్ణగా మార్చుకున్నారు ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్‌లో విడుదల చేద్దామని అనుకున్నారు. కాకపోతే, సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘సలార్’ సినిమా వాయిదా పడడంతో ఆ తేదీకి ‘రూల్స్ రంజన్’ వచ్చింది. ఈరోజు విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందనే భయంతోనే ప్రభాస్ తన ‘సలార్’ సినిమాను వాయిదా వేసుకున్నారని కొందరు ఎగతాళి చేశారు. ఈ ట్రోల్స్ గురించి ఒక జర్నలిస్ట్ ‘రూల్స్ రంజన్’ ప్రెస్ మీట్లో కిరణ్ అబ్బవరంను ప్రశ్నించారు. దీనికి కిరణ్ స్పందిస్తూ.. అలాంటి ట్రోల్స్, మీమ్స్‌ను తాను ఇప్పుడు పాజిటివ్‌గా తీసుకుంటున్నానని చెప్పారు.