Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ. విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లయ. కానీ ఆ చిత్రంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు.
Advertisement
Read also: పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?
Advertisement
ఆ తర్వాత 1999లో వేణు తొట్టెంపూడి హీరోగా తెరకెక్కిన స్వయంవరం సినిమాతో మొదటి సక్సెస్ అందుకుంది. ఆ చిత్రం లయ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక అప్పటినుండి మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగింది. పెద్దగా గ్లామర్ డోస్ లేకుండా వీలైనంత వరకు హోమ్లీ పాత్రలలోనే లయ తెలుగువారిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసింది. లయ చివరగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించిన విజయం తెలిసిందే.
ఈ చిత్రంలో జగపతిబాబు భార్యగా హీరోయిన్ లయని సంప్రదించారట దర్శకుడు త్రివిక్రమ్. స్వయంవరం చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య ఉన్న పరిచయంతో త్రివిక్రమ్ లయని సంప్రదించారు. కానీ ఈ ఆఫర్ ని లయ సున్నితంగా తిరస్కరించిందట. అప్పుడే వదిన, అమ్మ పాత్రలు చేసేందుకు తనకు ఇష్టం లేదని, అలాంటి పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Read also: “అక్కినేని ఫ్యామిలీ” పేర్లకు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !