Advertisement
ఒక సినిమా జయాపజయాలు పూర్తిగా దర్శకుడి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఇండస్ట్రీలో హీరోల పిల్లలు హీరోలుగా, హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుంటారు. మరి తెర వెనుక ఉండి వీళ్ళ అందరినీ గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏంటి..? వీరు ప్రపంచానికి దర్శకుల కుమార్తెలుగా బయట ప్రపంచానికి పరిచయమైనప్పటికీ.. వారిలో స్వతహాగా ఉన్న టాలెంట్ వలన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతుర్లు అనిపించుకుంటున్నారు. మరి అలా తండ్రులకు మంచి పేరు తీసుకు వస్తున్న కూతుర్లు ఎవరో? వారి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేసాడు ?
మొదటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన బుజ్జిగాడు సినిమాలో తన ఇద్దరు పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష, ప్రభాస్ పాత్రను పోషించింది పూరి పిల్లలు ఆకాష్, పవిత్రలే. ఇప్పుడు ఆకాష్ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు. ఇక ఇప్పుడు పవిత్రను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడు పూరి. త్వరలోనే పవిత్ర ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గురించి తాజా సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Advertisement
అలాగే ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి. ఈమె వయసులో చిన్నదే అయినా సింగిల్ టాలెంట్ ని ఇప్పటికే అర్బన్ జాయిన్ విత్ సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తన టాలెంట్ ను తెలియజేస్తోంది. ఆ మధ్య సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఒక పాటని విడుదల చేసి తన తండ్రికి అంకితం ఇచ్చింది. దీంతో సుకుమార్ లో ఉన్న టాలెంట్ కి తన కూతురు ఏమి తీసిపోదని అంటున్నారు నెటిజెన్లు.
ఇక మరోవైపు దర్శకుడు గుణశేఖర్ కి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె నీలిమ గుణ ఇప్పటికే నిర్మాతగా మారిపోయింది. ఇక చిన్న కూతురు కూడా ఏదో ఒక విభాగంలో పని చేస్తానని చెప్పుకొచ్చింది.
అలాగే దర్శకుడు మారుతి సైతం తన కూతురిని తన దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఈమె అత్యంత త్వరలోనే పూర్తిస్థాయి నటీమణిగా మారుతుంది అనడంలో ఏం సందేహం లేదు అంటున్నారు ప్రేక్షకులు.
Read also: మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!