Advertisement
ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుంది అంటే అది దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి వల్లే. జక్కన్న చెక్కిన సినిమా రికార్డులను చూసి ఇండస్ట్రీలన్నీ ఖంగుతిన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి పై ప్రేక్షకులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలను తెరకెక్కిస్తుంటారు రాజమౌళి. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన జక్కన్న.. ఇప్పుడు సినీ పరిశ్రమలోనే ప్రముఖ అగ్ర దర్శకులలో ఒకరు.
Advertisement
Read also: ఈ 15 మంది నటీనటులను మనం దాదాపు ప్రతి సినిమాలోని చూశాం.. కానీ వీరి పేర్లు మీకు తెలుసా..?
Advertisement
జక్కన్న తెరకెక్కించిన సినిమాలలో ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయంగా ఉన్న దర్శకులు, రచయితలు, పలువురు ప్రముఖులు సైతం జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి పారితోషికం కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. సినిమాల ద్వారా రాజమౌళి సంపాదించిన ఆస్తుల విలువ 200 కోట్లకు పైమాటే. రాజమౌళి పారితోషకం తీసుకోవడమే కాకుండా లాభాలలో వాటాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. అయితే రాజమౌళి తన పారితోషికంలో ఎక్కువ భాగం దేనికోసం ఖర్చు పెడతారు అనే విషయానికి వస్తే.. ఆయన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసమే ఖర్చు చేస్తారట. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి రాజమౌళి తెగ ఆసక్తి చూపిస్తారని సమాచారం. అందుకే సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసం ఆయన తన పారితోషికాన్ని వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారట. జక్కన్నకి సినిమాల మీద ఉన్న డెడికేషన్ కి నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు సినీ ప్రేక్షకులు.
Read also: వివాదంలో ‘వీర సింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !