Advertisement
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే గత ఆరు నెలల క్రితం తన భర్త నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.
Advertisement
ఇక కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు మూడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నాం, అని తెలపడంతో తమ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేము మా వైవాహిక బంధానికి ముగింపు చెప్తున్నాం అంటూ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమనే కాకుండా, అభిమానులు చాలామంది షాక్ అయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు, చీరలు చాలా ఫేమస్ గా మారాయి. ఇవన్నీ దగ్గుబాటి కుటుంబానికి చెందినవి అని వార్తలు వచ్చాయి.
Advertisement
అయితే ఆ నగలన్నీ దగ్గుబాటి ఫ్యామిలీనే ఇచ్చిందట. ఇక వీరు విడాకుల తర్వాత సమంత ఆ నగలు అన్నింటిని దగ్గుబాటి ఫ్యామిలీకి ఇచ్చేసిందట. అంతే కాకుండా దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ అమ్మ (నాగచైతన్య అమ్మమ్మ) , సమంతకు తాళిబొట్టు ప్రేమగా ఇచ్చారంట. దాన్ని చాలా ఇష్టంగా తీసుకున్న సమంత విడిపోయాక, ఆ తాళిని వాళ్ల అమ్మగారికి ఇచ్చేసి, సమంత అమ్మవారు పెట్టిన తాళిబొట్టు మాత్రం తన వద్దే ఉంచుకుందని టాక్. కాగా నాగచైతన్యను ప్రేమించక ముందే సమంత, హీరో సిద్ధార్థ మధ్య ప్రేమాయణం నడిపింది. వీరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇవి కూడా చదవండి : పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!