Advertisement
సాధారణంగా శ్రావణమాసంలో ఎన్నో పవిత్రమైన పండుగలను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటారు. శ్రావణమాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణాష్టమి అని దాదాపు చాలా మందికి తెలుసు. మహావిష్ణువు లోక కళ్యాణం కోసం ఎత్తిన అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీ శ్రీకృష్ణుడి అవతారం అని పండితులు పేర్కొంటున్నారు. కంసుని దురాగతాల నుంచి తన తల్లిదండ్రులను, ప్రజలను విముక్తి చేయడానికి శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి రోజు శ్రీకృష్ణుడు జన్మించినట్టు పండితులు చెబుతున్నారు.
Advertisement
విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీ కృష్ణుడు 8 సంఖ్యతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాడు. పంచాంగం ప్రకారం.. మనందరి జీవితంలో కొన్ని సంఖ్యలకు ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యలు జాతకంలో కూడా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. సంఖ్య 8 శనీశ్వరుడికి చెందింది. శ్రీ కృష్ణుడికి ఎనిమిదో సంఖ్యతో గాఢమైన అనుబంధముంది. ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ధర్మంలో శ్రీ విష్ణువు భూమిపై 10 అవతరాలు ఎత్తినందున దశావతారీ అని పిలుస్తారు. శ్రీశ్రీకృష్ణుడు విష్ణువు ఎనిమిదో అవతారం కాబట్టి సంఖ్య ఎనిమిది చాలా ప్రత్యేకమైంది. శ్రీకృష్ణుడు జన్మించిన రోజు రాత్రి 7 ముహుర్తాలు గడిచి 8వ ముహూర్తంలో భగవంతుడు ఆ సమయంలో రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కూడా ఉండటం మరో విశేషం.
Advertisement
శ్రీకృష్ణుడు పుట్టుక ముందు దేవకి వాసు దేవుల ఎనిమిదో సంతానం ద్వారా కంసుడు చంపబడుతాడని భవిష్యవాణి చెబుతుంది. దేవకి వాసుదేవులకు ఎనిమిదో సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించి మేనమామ కంసుడిని చంపాడు. పురాణాల ప్రకారం.. శ్రీ శ్రీకృష్ణుడి జన్మించి, తన మేనమామ కంసుడిని చంపాడు. పురాణాల ప్రకారం.. శ్రీ కృష్ణుడికి 8 మంది భార్యలున్నారు. అంతేకాదు.. కన్నయ్యకి 16,100 మంది గోపికలున్నారు. ఈ సంఖ్య మొత్తం ఎనిమిదే. శ్రీ కృష్ణుడి ఉపాదేశం అని పిలువబడే పవిత్ర గ్రంథం భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయంలోని ఎనిమిదో శ్లోకం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.