Advertisement
వారిద్దరూ ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. చివరికీ పెద్దలు కూడా ఆదరించడంతో హాయిగా కాపురం చేసుకోవాల్సిన స్థితిలోనే భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. వారు విడిపోవాలని నిర్ణయించుకున్న తరువాత కూడా ఆమెను అతను విడిచిపెట్టలేదు. వెంటపడి వేధించడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. కోపం పెంచుకున్నాడు. కక్ష కట్టి మరీ ఘాతుకానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలంలో కనిపించిన దృశ్యాలు.. పోలీసుల దర్యాప్తులో కీలక విషయం వెల్లడి అయింది. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన అనుమానస్పద మృతిని పోలీసులు *త్య గా భావించారు.
Advertisement
ఇన్వెస్టిగేషన్ అధికారి, డీఎస్పీ సత్యనారాయణ తెలిపివన వివరాల ప్రకారం.. అగంపూడికి చెందిన మహాలక్ష్మీ, గాజువాక బీసీ సెంటర్ కి చెందిన శ్రీనివాస్ ఇంటర్మీడియట్ లో క్లాస్ మెట్స్. వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. పెద్దలను ఎదురించి వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిలోపే వీరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయి. వీరి మధ్య ఉన్న విభేదాలు విడాకుల వరకు వెళ్లాయి. చివరికీ వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2021లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీనివాస్ కోర్టుకు సక్రమంగా హాజరయ్యేవాడు కాదు.. దీంతో విడాకుల ప్రక్రియ కాస్త ఆలస్యం అయింది. అగనంపూడి నుంచి రాంబిల్లికి రోజూ బస్సులో ఉద్యోగానికి వెళ్తున్న మహాలక్ష్మీ సంతోషంగా ఉండటం ఇష్టంలేని శ్రీనివాస్ మద్యానికి బానిస అయ్యాడు. ఏ పని లేకుండా అవారాగా తిరిగేవాడు. భార్య మహాలక్ష్మీని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో మహాలక్ష్మీ పై పగ పెంచుకొని ఎలాగైనా ఆమెను లేకుండా చేయాలని భావించాడు.
Advertisement
దాదాపు నెల రోజుల నుంచి మంచివాడుగా మారినట్టు శ్రీనివాస్ నటించాడు. ఆ అమ్మాయికి తనపై సానుభూతి కలిగించే విధంగా చేశాడు. పథకం ప్రకారం.. అచ్యుతాపురంలోని లాడ్జీలో తన పేరు మీద రూమ్ బుక్ చేశాడు. తనతో పాటు బిర్యాని, మత్తు ఇంజక్షన్, కత్తి కూడా తీసుకొచ్చాడు. లాడ్జీ నుంచి మహాలక్ష్మీకి పోన్ చేశాడు. రమ్మని ప్రాధేయపడ్డాడు. దీంతో ఆమె లాడ్జీ వద్దకు వచ్చింది. ఇక అక్కడే దారుణం జరిగింది. మహాలక్ష్మీ శరీరంపై దాదాపు 20కి పైగా కత్తి గాట్లు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకోవడంతో మరుసటి రోజు వరకు కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. మహాలక్ష్మీ భర్త శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!
పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?